తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. సినిమాలకి కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్టులు మాత్రం ఫినిష్ చేస్తానన్నారు. అందులో భాగంగా విజయ్..వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో.. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్) అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త మరో అప్‌డేట్ సోషల్ మీడియాలో తిరుగుతోంది. తాజా రూమర్స్ ప్రకారం ఈ సినిమాలో త్రిష ఓ కీలక పాత్రలోచేస్తున్నట్లు తెలుస్తోంది. ఘోస్ట్ పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లు టాక్. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన ఏం రాలేదు. త్రిష ఇటీవల విజయ్ సరసన ‘లియో’ నటించిన సంగతి తెలిసిందే.
చాలా ఏళ్ల తర్వాత మరోసారి లియోలో వీరిద్దరూ జోడి కట్టారు. ఇక ది గోట్ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలపతి, కలపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కలపతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ బ్యూటీ.. మెగాస్టార్ ‘విశ్వంభర’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న మరో చిత్రంలో కూడా త్రిషను తీసుకుంటున్నట్లు టాక్. త్రిష రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇలా అటు తమిళ్, ఇటు తెలుగులో మళ్లీ బిజీగా మారిపోయింది. తెలుగులో త్రిష కోసం మిగిలిన సీనియర్ హీరోలు కూడా వెయిటింగ్‌లో ఉన్నట్లు టాక్.