HomeTelugu Trendingసంతోష్‌ శోభన్‌ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల

సంతోష్‌ శోభన్‌ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల

Santhosh shobhans new movie
టాలీవుడ్‌ యంగ్‌ హీరో సంతోష్ శోభ‌న్ ప్ర‌స్తుతం మూడు సినిమాల‌ను సెట్స్‌పైన ఉంచాడు. అందులో మేర్ల‌పాకి గాంధి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ఒక‌టి. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని ‘లైక్ షేర్ అండ్ స‌బ్‌స్రైబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ.. పోస్ట‌ర్‌ను విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్ సంతోష్ శోభ‌న్, ఫ‌రియా అబ్దుల్లా, సుద‌ర్శ‌న్ ముగ్గురు పైకి చూస్తూ కెమెరాకు ఫోజులిస్తున్నారు.

టైటిల్‌తోనే మేక‌ర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. నిహారిక ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అడ్వేంచ‌ర‌స్ ట్రావెల్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందిస్తున్నాడు. కాగా సంతోష్ శోభ‌న్ న‌టించిన ఏక్ మిని క‌థ సినిమాకు మేర్ల‌పాక గాంధి క‌థ‌ను అందించాడు. ఇక ఈ సారి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే సినిమా చేయ‌డంతో ప్రేక్ష‌కుల‌లో అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu