సప్తగిరి కోసం పవన్..?

తెలుగులో కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోలుగా మారుతున్న వారిలో కమెడియన్
సప్తగిరి ఒకరు. ఆయన హీరోగా నటిస్తోన్న ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల
ముందుకు రానుంది. అరుణ్ పవార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో విడుదల
కార్యక్రమానికి సిద్ధపడుతోంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్
విచ్చేయచున్నాడనేది తాజా సమాచారం. నిజానికి ఈ సినిమాకు మొదట ‘కాటమరాయుడు’
అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. అయితే పవన్ కాలయన్ ఆయన సినిమా కోసం అడగడంతో
ఆ టైటిల్ ఇచ్చేసి ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ అనే టైటిల్ ను పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ కృతజ్ఞతతోనే
పవన్ ఈ ఆడియో ఫంక్షన్ కు వస్తాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తన
సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అటు మరో బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాడు.
ఈ నేపధ్యంలో ఆయన ఇలాంటి కార్యక్రమాలకు హాజరవుతారో లేదో.. చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates