HomeTelugu Big Storiesఆహా వేదికగా హోస్ట్‌గా మారనున్న సమంత

ఆహా వేదికగా హోస్ట్‌గా మారనున్న సమంత

'SamJam' with Samantha on Aha!
అక్కినేని వారి కోడలు సమంత అన్ని రంగల్లోని దూసుకుపోతుంది. సినిమాలతో పాటు కుటుంబానికి కూడా తగినంత ప్రాధ్యానత ఇస్తుంది. పెళ్లి తర్వాత కూడా సమంత స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతుంది. గతేడాది భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’, ‘ఓ బేబి’ తో హిట్‌ అందుకుంది. మరోవైపు తన స్నేహితురాల్లతో కలిసి జూబ్లిహిల్స్‌లో ఓ ప్రీ స్కూల్‌ను కూడా స్టార్ట్ చేసింది. అంతేకాదు వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టి సత్తా చాటింది. తాజాగా బిగ్‌బాస్‌ షోకి ఓ వారం హోస్ట్‌గా వ్యవహరించి తనదైన శైలిలో నడిపించి వావ్ అనిపించింది.

దసరా స్పెషల్‌గా వచ్చిన సమంత తన యాంకరింగ్‌తో శభాష్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఎపిసోడ్ కు మంచి టీఆర్పీనే వచ్చింది. తాజాగా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో హోస్ట్‌గా వ్యవహరించనుంది. అంతేకాదు హోస్ట్‌గా పలువురు సెలబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూలను చేయనుంది. ఈ షో నవంబర్ 13న దీపావళి కానుకగా ప్రీమియం కానుంది. ఈ షోలో ముందుగా మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, తమన్నా, రష్మిక, సైనా నెహ్వాల్ దంపతులను ఇంటర్వ్యూ చేయనుంది. సమంత అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu