బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటే..!

బాహుబలి మొదటి పార్ట్ చూసిన ప్రేక్షకులందరిలో కలిగే మొదటి ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?. ఈ ఒక్క ప్రశ్న ద్వారా ఆడియన్స్ లో రెండో భాగంపై క్యూరియాసిటీను పెంచడంలో దర్శకుడిగా రాజమౌళి సక్సెస్ అయ్యాడు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం చాలా సాదాసీదాగా ఉంటుందని తెలుస్తోంది. తన కొడుకు భల్లాలదేవ, భర్త చెప్పిన మాటలు విని రాజమాత శివగామి.. బాహుబలిని చంపమని కట్టప్పను ఆదేశిస్తుంది. ఇక కట్టప్ప వెళ్ళి బహుబలిని చంపేస్తాడు. వీటిని తెరకెక్కించిన సన్నివేశాలు కూడా అంత ఆసక్తికరంగా ఉండవని తెలుస్తోంది.
 
అయితే విజువల్స్, గ్రాండియర్ లుక్ సినిమాకు ప్లస్ అవుతుందని సమాచారం. ఇటీవల ప్రభాస్ కూడా సినిమా చూసిన తరువాత ప్రేక్షకుడు కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడనే విషయం గురించి కాకుండా విజువల్స్ గురించే చర్చించుకుంటారని తన మాటల్లో చెప్పాడు. దీన్ని బట్టి సెకండ్ హాఫ్ లో ఈ ప్రశ్న పెద్ద ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కాదని తెలుస్తోంది. అయితే హాలీవుడ్ స్టాండర్డ్స్ కు ఏ మాత్రం తగ్గని రీతిలో సినిమా ఉంటుందని చెబుతున్నారు. సినిమా చూసే ప్రేక్షకుడికి ఇదొక కన్నుల పండువగా తీర్చిదిద్దినట్లు అంటున్నారు. ఇంటర్వల్ బ్యాంగ్, కుంతలదేశంలో జరిగే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని సమాచారం.