HomeTelugu Trending100 మిలియన్ల వ్యూస్‌తో సారంగదరియా!

100 మిలియన్ల వ్యూస్‌తో సారంగదరియా!

Saranga dariya song to 100
‘దాని కుడి భుజం మీద కడువా… దాని కుత్తెపు రైకలు మెరియా..’ ఇప్పుడు అందిరినోట నోట ఇదే పాట. ఎవరి ఫోన్‌ రింగయినా ఇప్పుడు ఇదే. అంతలా మార్మోగిపోతోందీ సాంగ్‌. అచ్చమైన జానపదాన్ని రంగరించి పోసినట్లున్న దీన్ని అక్కున చేర్చుకున్నారు తెలుగు ప్రజలు. అందుకే ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా ప్రజలు దీన్ని అమితంగా ఆదరించారు. ఈ నేపథ్యంలో సారంగదరియా పాట తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో విడుదలైన కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ఓ తెలుగు పాట ఇంత త్వరగా ఈ రికార్డును సాధించడం చాలా అరుదైన విషయమని చెప్తున్నారు. ఇక ఈ సాంగ్‌ కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు సాధించి అల వైకుంఠపురములో చిత్రంలోని బుట్టబొమ్మ, రాములో రాములా పాటల పేరిట ఉన్న రికార్డులను తిరగరాసింది.

పవన్‌ సీహెచ్‌ సంగీతానికి తోడు సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం మంగ్లీ అలపించింది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో సాయి పల్లవి తనదైన స్టైల్‌లో నాట్యం చేసిందని చెప్పవచ్చు. మొత్తానికి లవ్‌ స్టోరీ సినిమాకు ఈ సాంగ్‌ బాగానే ప్లస్‌ అవుతోంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాకి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu