HomeTelugu Trendingడాంగ్.. డాంగ్‌.. అంటూ.. లైవ్‌లో డ్యాన్స్‌ చేసిన తమన్నా

డాంగ్.. డాంగ్‌.. అంటూ.. లైవ్‌లో డ్యాన్స్‌ చేసిన తమన్నా

6 4
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘డాంగ్.. డాంగ్‌..’ అంటూ పాటకు తమన్నా లైవ్‌ డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో డ్యాన్స్‌ చేసే అవకాశం ఇచ్చిన మహేష్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు అనిల్‌ చాలా చక్కని వ్యక్తి అని అన్నారు. ఆయన టేకింగ్‌ బాగుంటుందని తెలిపారు.

అంతకుముందు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘ఈ సంక్రాంతికి ఎవరూ మహేష్‌బాబుకు సరిరారని అన్నారు. నా సోదరుడు అనిల్ రావిపూడి గమ్మత్తైన వేషం ఇచ్చారు. మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడి, నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు గార్లకు ధన్యవాదాలు’ అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu