HomeTelugu Big Stories'సత్యభామ'గా కాజల్‌ టైటల్‌ గ్లింప్స్‌ విడుదల

‘సత్యభామ’గా కాజల్‌ టైటల్‌ గ్లింప్స్‌ విడుదల

Satyabhama Title Glimpse
పంజాబీ ముద్దుగుమ్మ కాజల్‌ రీఎంట్రీలో తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉంది. పలువురు స్టార్‌ హీరోలతో నటిస్తూ మునుపటి జోరును ప్రదర్శిస్తోంది.

అంతేకాదు ఓ ఫీమేల్ లీడ్ సినిమా కూడా చేస్తోందామె. ఈరోజు కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రానికి ‘సత్యభామ’ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇందులో కాజల్ ఏసీపీ సత్యభామ అనే పవర్‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌గా కనిపిస్తోంది. సినిమాలో ఆమె క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ గ్లింప్స్‌ ను కూడా విడుదల చేశారు. అందులో సెల్ లో ఉన్న ఓ నిందితుడు ఎంత కొట్టినా నోరు మెదపకపోవడంతో చీర, చేతి గాజులతో వచ్చిన కాజల్ కొట్టిన దెబ్బలకు నిజం చెప్పేసే సీన్ ఆసక్తికరంగా ఉంది.

మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కాజల్ మెప్పించనుంది. ఈ సినిమాతో అఖిల్ డేగల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గూఢచారి, మేజర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ శశికిరణ్ తిక్క ఈ సినిమాను సమర్పణలో ఆయన సోదరుడు బాబీ తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu