చరణ్ బాగానే తప్పించుకున్నాడు!

ప్రముఖ నిర్మాత దిల్ రాజు చాలా రోజులుగా నటుడు రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. హరీష్ శంకర్ తదుపరి సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందనుంది. దీంతో హరీష్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సినిమా ప్లాన్ చేశాడు దిల్ రాజు. ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా సమయంలోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాలనుకున్నాడు. కానీ డిజె రిజల్ట్ చూసి డెసిషన్ తీసుకోవాలనుకున్న చరణ్ కాస్త సమయం అడిగాడట. అయితే హరీష్ శంకర్ దర్శకత్వ ప్రతిభ మీద చరణ్ కు పెద్దగా నమ్మకం లేదట.
పైగా హరీష్ శంకర్ స్టయిల్ లో ఉండే కమర్షియల్ సినిమాలకు చరణ్ ఈ మధ్య దూరంగా ఉంటున్నాడు. అందులోనూ డిజె సినిమాకు నెగెటివ్ రివ్యూలు రావడంతో చరణ్ తెలివిగా దిల్ రాజుకి నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో దిల్ రాజు మరో కొత్త దర్శకుడిని రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ కొత్త దర్శకుడితో చరణ్ కు కథ వినిపించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రస్తుతం చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.