ఆర్య, సాయేషాలది ప్రేమ వివాహం కాదు

తమిళ హీరో ఆర్య, సాయేషా సైగల్‌ త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే. తాము వివాహం చేసుకోబోతున్నట్లు ప్రేమికుల రోజు సందర్భంగా ఇద్దరూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. అయితే వీరి పెళ్లి విషయమై సాయేషా తల్లి షహీన్‌ ఓ తమిళ మీడియా వర్గం ద్వారా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సాయేషా, ఆర్యలది ప్రేమ వివాహం కాదని తెలిపారు. ఆర్య తల్లిదండ్రులే మొదట పెళ్లి ప్రస్తావన తెచ్చారని పేర్కొన్నారు. సాయేషాకు కూడా ఆర్య నచ్చడంతో పెళ్లి కుదిరిందని అన్నారు. అయితే.. సాయేషా, ఆర్య ‘గజినీకాంత్‌’ సినిమా సమయంలో ప్రేమించుకున్నారని గతంలో వార్తలు వెలువడ్డాయి. దీనిపై షహీన్‌ స్పందిస్తూ.. అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. వారిద్దరికీ పెళ్లి కుదిరే వరకు ఒకరితో ఒకరు డేటింగ్‌లో లేరని వెల్లడించారు. మార్చిలో ఆర్య, సాయేషాల వివాహం జరగబోతోంది. అయితే పెళ్లి తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.