HomeTelugu Newsకోలీవుడ్‌ హీరో మేక్‌ఓవర్‌.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్‌

కోలీవుడ్‌ హీరో మేక్‌ఓవర్‌.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్‌

Kollywood hero makeover pic

కోలీవుడ్ హీరో ఆర్య గురించి ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. ఆర్య తెలుగులో వరుడు, సైజ్ జీరో, సైంధవ్ లాంటి చిత్రాల్లో నటించాడు. ఆర్య న‌టించిన త‌మిళ సినిమాలు తెలుగులో కూడా డ‌బ్ అయ్యి మంచి విజ‌యం సాధిస్తూ ఉంటాయి.

ఆర్య ప్ర‌స్తుతం ‘మిస్టర్‌ ఎక్స్‌’ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ కోసం ఆర్య చాలా క‌ష్టప‌డుతున్నాడు. ఈ సినిమా గ‌తేడాది సెప్టెంబర్‌లో ప్రారంభంకాగా.. అప్ప‌టినుంచి మూవీ కోసం నిరంత‌రం శ్ర‌మిస్తునే ఉన్నాడు.

తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్ షెడ్యూల్ నుంచి చివ‌రి షెడ్యూల్ వ‌ర‌కు త‌న బాడీ మేక్ఓవర్ పై ప్ర‌త్యేక పోస్ట్ పెట్టాడు. 2023 ఏప్రిల్‌లో మిస్టర్‌ ఎక్స్ షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి.. 2024 మార్చిలో చివ‌రి షెడ్యూల్ వ‌ర‌కు నా లుక్‌ ఇలా ఉంది అంటూ ఫోటోలు షేర్‌ చేశాడు.

ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజ‌న్లు ఆర్య ఫిట్‌నెస్‌కు ఆశ్చర్య పోతున్నారు. వాట్ ఏ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మిస్ట‌ర్ ఎక్స్ సినిమాకు మ‌ను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తిక్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu