విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌ ఎంట్రీ..!

క్రేజీ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ.. మొదటి చిత్రం అర్జున్‌ రెడ్డి చిత్రంతో స్టార్‌ డమ్‌ను సంపాదించుకున్నాడు. ‘గీత గోవిందం ‘ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో దర్శక నిర్మాతలు విజయ్‌ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ‘నోటా’ సినిమాతో పాటు ‘టాక్సీవాలా’ సినిమాలో నటిస్తున్న విజయ్‌ త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీకి రెడీ అవుతున్నాడట.

బాలీవుడ్ దర్శకులు రాజ్‌ & డికెలు విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్‌లో షోర్‌ ఇన్‌ ద సిటీ, గో గోవా గోన్‌ సినిమాలతో ఆకట్టుకున్న ఈ దర్శకులు తాజాగా ‘స్త్రీ’ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. తెలుగులో ఢీ ఫర్‌ దోపిడి సినిమాకు దర్శకత్వం వహించారు