బాలయ్యపై వస్తున్నట్రోలింగ్స్‌పై ‘సెహరి’ హీరో, హీరోయిన్‌ల స్పందన


టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ తరచూ ట్రోల్స్‌కు గురికావడం మనం చూస్తునే ఉంటాం. తాజాగా ఆయన ‘సెహరి’ మూవీ ఫస్ట్‌లుక్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో హీరో హర్ష్‌పై బాలకృష్ణ చేయి చేసుకున్నారని, నిర్మాత అద్వయపై ఆగ్రహం వ్యక్తం చేశారని, తన ఫోన్‌ను బాలయ్య విసిరి కొట్టారని మీమ్స్ సోషల్ మీడియాలో హల్ ‌చల్ చేశాయి. హర్ష్‌పై బాలయ్య చేయి చేసుకోలేదు. ఈ విషయాన్ని హర్ష్ స్వయంగా వెల్లడించారు. తన స్నేహితులతో కలిసి ఒక విర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్న హర్ష్.. బాలయ్యపై మొదలైన మీమ్స్ గురించి వివరణ ఇచ్చారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పుడు తాను పోస్టర్‌ను ఎడమ చేతితో పట్టుకున్నానని, అందుకుని ఆ చేయి మీద బాలయ్య చిన్నగా కొట్టి కుడి చేతితో పట్టుకోమని చెప్పారని, ఈ మాత్రం దానికి రకరకాల సౌండ్లతో మీమ్స్ వచ్చేశాయని హర్ష్ వివరించారు. కరెక్ట్‌గా ఫస్ట్ లుక్ లాంచ్ చేసే సమయంలో ఫోన్ రావడంతో దాన్ని కూడా తన అసిస్టెంట్ పట్టుకుంటాడనే ఆయన విసిరినట్టున్నారు’’ అని వివరణ ఇచ్చారు. మొత్తం మీద తననైతే బాలయ్య కొట్టలేదని ఆ మీమ్స్‌కు హర్ష్ ఫుల్‌స్టాప్ పెట్టేశారు.

తాజాగా వీటిపై ‘సెహరి’ హీరోయిన్‌ సిమ్రన్‌ చౌదరి స్పందించింది. మిమర్స్‌ను ఏకిపారేసింది. ‘అందరికి హాయ్‌.. ఈ స్టోరీ ప్రత్యేకంగా మిమర్స్‌ మిత్రుల కోసమే పెడుతున్నాను. నిన్న జరిగిన మా ‘సెహరి’ పోస్టర్‌ విడుదల కార్యక్రమాన్ని అంత బాగా పాపులర్‌ చేసిన ప్రతి ఒక్క మిమర్స్‌ మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు క్రియేట్‌ చేసి నన్ను ట్యాగ్‌ చేసిన ప్రతి మీమ్‌ నేను చుశాను. ఇవి నిజంగానే కామెడిగా అనపించాయి. కరోనా వంటి కష్టకాలంలో మీ మిమ్స్‌తో ప్రజలకు వినోదాన్ని ఇస్తున్న మీ క్రియేటివిటికి ధన్యవాదాలు’ అంటూ ఆమె తనదైన శైలిలో మిమర్స్‌కు చురక అంటించింది.

CLICK HERE!! For the aha Latest Updates