సెన్సార్ కార్యక్రమాల్లో ‘త్రయం’

సెన్సార్ కార్యక్రమాల్లో ‘త్రయం’ 
విషురెడ్డి, అభిరామ్, సంజన , అశోక్ ప్రధాన పాత్రల్లో పంచాక్షరీ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ‘త్రయం’. డా.గౌతమ్ దర్శకత్వంలో పద్మజానాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉంది.  దర్శకుడు డాక్టర్.గౌతమ్ మాట్లాడుతూ  ‘ముగ్గురు వ్యక్తుల శక్తియుక్తుల నేపధ్యంలో చాలా రియలిస్టిక్‌గా , ఎలాంటి రోప్స్, డూప్స్ లేకుండా తీసిన యాక్షన్ సీన్స్ ‘త్రయం’ లో హైలెట్‌గా ఉండబోతున్నాయి. యాక్షన్ సీన్స్ తీసే క్రమంలో లీడ్‌రోల్స్‌లో నటించిన వారికి ఎన్నో గాయాలు అయినా ఏమాత్రం లెక్కచేయకుండా ఆడియెన్స్‌కు ఓ సరికొత్త థ్రిల్‌ను అందించేలా చిత్రీకరణ చేశాం. తెలుగులో పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగింది కాబట్టి అన్నింటిని దృష్టిలో ఉంచుకొని ‘త్రయం’ను చిత్రీకరించాం. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న త్రయం సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు.


CLICK HERE!! For the aha Latest Updates