ఈ ‘కమ్మ’ నంది నాకొద్దు!

రోజురోజుకి నంది అవార్డుల వివాదం చెలరేగుతూనే ఉంది. తాజాగా నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఈ నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చిన ఈ నంది అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన పోసాని ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
చేశారు. ఓ పక్క కేసీఆర్ ను పొగుడుతూనే.. మరో పక్క చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై విరుచుకుపడ్డారు.

నంది అవార్డులలో ముందు తన పేరు చూసి చాలా సంతోషపడ్డానని, కాకపోతే నందిపై ‘కమ్మ అవార్డులు’ అనే ముద్ర పడడంతో దాన్ని అందుకోవడానికి చాలా సిగ్గుగా ఉందని తెలిపారు. పోసాని నంది అవార్డు తిరిగి ఇచ్చేయడం నిజంగానే షాక్ ఇచ్చే విషయం. మరి నంది అవార్డులపై అసంతృప్తిగా ఉన్నవారు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటారా..? లేదా..? అనేది చూడాలి..!