HomeTelugu Trendingదేవర సినిమాలో కీలక పాత్రకు సీనియర్ నటి

దేవర సినిమాలో కీలక పాత్రకు సీనియర్ నటి

Devara movie update 1
ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవ‌ర‌’. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ హీరోయిన్‌. సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్‌ చాకో విలన్లు.

ప్రస్తుతం ‘దేవర’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పార్ట్ త్వరలోనే పూర్తికానుంది. ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి ఈ సినిమాకు పాటలు రాయడం స్టార్ట్ చేసినట్టు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

తాజాగా దేవర సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ మూవీలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో నా అల్లుడు మూవీలో ఎన్టీఆర్‌కు అత్తగా రమ్యకృష్ణ చేసిన సంగతి తెలిసిందే.

దేవర సినిమాలో హీరోయిన్ జాన్వీకపూర్‌కి తల్లిగా రమ్యకృష్ణ నటించనున్నట్టు చెప్తున్నారు. ఎన్టీఆర్, రమ్యకృష్ణ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

దేవర సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu