HomeTelugu Trendingఏఎన్నార్‌ పురస్కారం: నాన్న ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం..

ఏఎన్నార్‌ పురస్కారం: నాన్న ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం..

8 14

టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కోరిక మేరకు అలనాటి తారలు శ్రీదేవి, రేఖకు ఏఎన్నార్‌ అవార్డులు ఇస్తున్నామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిరంజీవి, సుబ్బరామి రెడ్డి, బోనీ కపూర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై తొలుత నాగ్‌ మాట్లాడారు

సినిమా నాకు సర్వస్వం. అదే నాకు ఎంతో ఇచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఓ అవార్డు సృష్టించబడింది. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చేవారిని ఏఎన్నార్‌ జాతీయ అవార్డుతో సత్కరించాలనుకున్నాం’ ఇది ఏఎన్నార్‌ జాతీయ అవార్డు గురించి నాన్న మందిలో ఆయన చెప్పిన మాటలు. ఆయన సంకల్పమే ఇవాళ మమ్మల్ని నడిపిస్తోంది. ఆయన ఆలోచనలనే మేం ఆచరిస్తున్నాం. చిత్ర పరిశ్రమలోని గొప్ప వ్యక్తులను సత్కరించి, వారి పేరుతోపాటు నాన్న పేరు కూడా చిరకాలం ఉండేలా ఈ అవార్డు ఇస్తున్నాం. శ్రీదేవి, రేఖకు ఆ గౌరవం దక్కాలని, వారికి ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు. ఆయన ఉన్నప్పుడు వీరికి ఇవ్వలేకపోయాం. కానీ, తెలుగు సినిమా ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావు ఉంటారు. ఈ వేదికపై ఉన్న ఏఎన్నార్‌ జాతీయ అవార్డుతోపాటు నాన్న ఇక్కడ మనతోనే, మనలోనే ఉన్నారని అనుకుంటున్నా. ఈ అవార్డులతో ఆయన సంకల్పం నెరవేరుతుందని ఆశిస్తున్నా’ అని నాగ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగచైతన్య, అఖిల్‌, అక్కినేని అమల, విజయ్‌దేవర కొండ, మంచులక్ష్మి, నిహారిక, అడవి శేష్‌, రాహుల్‌ రవీంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

‘పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో..’ శ్రీదేవి గురించి సీతారామశాస్త్రి గారు రాసిన మాటలు ఇవి. ఇవి అక్షరాల నిజం. శ్రీదేవితో కలిసి నాలుగు సినిమాల కోసం పనిచేశా. అందులో మొదటిది ‘ఆఖరి పోరాటం’. ఆమె సెట్‌లోకి వస్తున్నారంటే నిశ్శబ్దంగా ఉండేవాళ్లం. అప్పటి వరకు గొడవ గొడవగా ఉండేది. ఆమె సెట్‌లోకి వస్తుంటే మేం లేచి నిల్చునేవాళ్లం. ఆఖరికి దర్శకుడు కె.రాఘవేంద్రరావు గారు కూడా లేచి నిలబడేవారు. ‘ఎందుకు సర్‌, మీకు ఆవిడ బాగా తెలుసు కదా’ అని అడిగే.. ‘ఆమె దేవత’ అనేవారు. భగవంతుడు శ్రీదేవికి అందం, అభినయం ఇవ్వడం ఆమె అదృష్టం అంటారు. కానీ నేను కాదంటాను. బోనీ కపూర్‌లాంటి భర్త దొరకడం ఆమె అదృష్టం. భారత చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు శ్రీదేవి ఉంటారు. ఇది భావోద్వేగంతో కూడుకున్న సమయం’ అని నాగ్‌ చెప్పారు.

అనంతరం రేఖను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘రేఖ గారు.. మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడగాలని ఉంది. మేమంతా కమర్షియల్‌ సినిమాలు చేస్తుంటాం. వాటితోనే విలవిలలాడుతుంటాం. ఆ బాధ చిరుగారికి కూడా తెలుసు. కానీ మీరు ఓ పక్క కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే.. మరోపక్క లీడ్‌ రోల్‌లో చేశారు. ఇది మీ వల్ల ఎలా సాధ్యమైంది?. ఇక రెండో ప్రశ్న.. మీరు ఇంత అందంగా ఎలా ఉంటారండీ?.. మీకు సాటిలేదు. మీ అందానికి వయసుతో సంబంధం లేదు. రేఖ, శ్రీదేవి ఇద్దరు తెలుగువారే. మీ పట్ల మేం గర్వంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.

నాగ్‌ ప్రశ్నలకు రేఖ సమాధానం ఇచ్చారు. ‘నేను సినిమాల్లో నటిస్తున్నప్పుడు నాకు ఏమీ తెలియదు. సినిమా అంటే సినిమానే.. కమర్షియల్‌, నాన్‌ కమర్షియల్‌, కలర్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌.. సినిమాలో నటించేందుకు ఇలా తేడాలు ఉండవు. రెండో ప్రశ్నకు నా సమాధానం. ‘మీరు ఎంత అందంగా ఉన్నారో, నేను అంతే అందంగా ఉన్నాను. అందం అనేది ఎదుటి వ్యక్తి చేసేదాన్ని బట్టి ఉంటుంది’ అని రేఖ సమాధానమిచ్చారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu