HomeTelugu Big Storiesటాలీవుడ్‌ సీనియర్ దర్శకుడు కన్నుమూత

టాలీవుడ్‌ సీనియర్ దర్శకుడు కన్నుమూత

Senior director NB Chakrava

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగులో అనేక హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సీనియర్ దర్శకుడు ఎన్.బి.చక్రవర్తి ఈ ఉదయం కన్నుమూశారు. ఈ మేరకు బీఏ రాజు ట్వీట్‌ చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చక్రవర్తి ఈ రోజు ఉదయం కన్ను మూశారని రాజు ట్వీట్‌ చేశారు. చక్రవర్తి శోభన్ బాబుతో 1984లో ‘సంపూర్ణ ప్రేమాయణం’, 1985-86లో నందమూరి బాలకృష్ణ నటించిన ‘కత్తుల కొండయ్య’, ‘నిప్పులాంటి మనిషి’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలానే 1986లో వచ్చిన ‘కాష్మోరా’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, భానుప్రియ, శరత్‌బాబు కీలక పాత్రల్లో నటించారు. సీనియర్ దర్శకుడి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu