HomeTelugu Trending'శాకుంతలం' వాయిదా

‘శాకుంతలం’ వాయిదా

shaakuntalam movie release

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. ఈ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ క్రమంలో వరుస అప్ డేట్స్ విడుదల చేస్తున్నారు.

ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు,టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. దర్శకుడిగా గుణశేఖర్ కి ఈ తరహా కథలపై మంచి పట్టు ఉంది.. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పాడ్డాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు మూవీ యూనిట్‌ వెల్లడించింది. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లకు రావడం లేదనీ, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

20230207fr63e1f669d99b6

Recent Articles English

Gallery

Recent Articles Telugu