HomeTelugu Trendingడైరెక్టర్‌గా మారిన మరో 'జబర్ధస్త్‌' నటుడు

డైరెక్టర్‌గా మారిన మరో ‘జబర్ధస్త్‌’ నటుడు

another Jabardasth comedian

ఈటీవిలో ప్రసారం అవుతున్న ‘జబర్ధస్త్‌’ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. నటులుగా, దర్శకులుగా, టెక్నీషియన్‌లుగా ఇలా పలు విభాగాల్లో జబర్దస్త్‌ నటులు మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. ఇప్పటికే సుధీర్‌ హీరోగా సినిమా చేస్తున్నాడు. ఇక గెటప్‌ శ్రీను, మహేష్‌, చమ్మక్‌ చంద్ర,
ఆది, ఇలా పలువురు నటులుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా జబర్దస్త్‌ నటుడు వేణు బలగంతో సినిమాతో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వేణు తరహాలోనే మరో నటుడు దర్శకుడిగా మారాడు.

జబర్దస్త్‌లో తన కామెడీ టైమింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల పంచిన శాంతి కుమార్‌ ఇప్పుడు మెగాఫోన్‌ పట్టాడు. ప్రముఖ నటుడు సాయికుమార్‌ను ప్రధాన పాత్ర ‘నాతో నేను’ అనే ఇంట్రెస్టింగ్‌ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఎమోషనల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌తో పాటు పాటలకు సాహిత్యం కూడా అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్‌లో కనువిందు చేయడానికి ముస్తాబవుతుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu