HomeTelugu Trending'శాకుంతలం' రిలీజ్‌ డేట్‌ విడుదల

‘శాకుంతలం’ రిలీజ్‌ డేట్‌ విడుదల

Shaakuntalam release date
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణ శేఖర్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్‌డేట్‌ అందించింది గుణ శేఖర్‌ టీం. శాకుంతలం చిత్రాన్ని నవంబర్‌ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

విడుదల తేదీని ప్రకటిస్తూ.. చిన్న గ్లింప్స్‌ వీడియోను లాంఛ్‌ చేసింది. ఫీ మేల్‌ ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని గుణ టీమ్‌ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu