టాలీవుడ్ యంగ్ హీరో నితిన్–షాలినీల వివాహం.. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి 8:30 గంటలకు జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనను పాటించి, కొంతమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వివాహం అనంతరం షాలినీ మెడలో తాళి కడుతున్న ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసిన నితిన్ ‘మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా.. మీ దీవెనలు కావాలి’ అని పేర్కొన్నారు
ఈయన పెళ్లి సందడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితిన్ పెళ్లి సందర్భంగా ‘ఏ క్యూట్ మ్యారేజ్ గిఫ్ట్ టు అవర్ హీరో’ అంటూ ‘రంగ్ దే’ టీమ్ టీజర్‌ని విడుదల చేసింది. కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది.