HomeTelugu Trending'శబాష్ మిథు' ఫస్ట్‌లుక్‌.. మిథాలీగా తాప్సి

‘శబాష్ మిథు’ ఫస్ట్‌లుక్‌.. మిథాలీగా తాప్సి

7 24
ఇప్పటికే ఎందరో క్రీడాకారులపై బయోపిక్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెట్రి క్రీడాకారిణి మిథాలీ రాజ్ ఓ బయోపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శబాష్ మిథు పేరుతో ఈ సినిమా రూపొందుతుంది. తెలుగమ్మాయి అయిన మిథాలీ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డ్ సాధించింది. ఈ సినిమాలో తాప్సి మిథాలీ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకుసంబందించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో తాప్సీ మిథాలీ పాత్ర‌లో ఒదిగిపోయి. ఒక స్టైలిష్ షాట్ ఆడుతున్నట్టు పోస్టర్‌ను డిజన్ చేసారు. ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా 2021ఫిబ్రవరి 2న సినిమాను విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ ద్వారా తెలుస్తోంది. వ‌యాకామ్ 18 సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu