HomeTelugu Big Storiesపెళ్లి పీటలెక్కనున్న సొట్టబుగ్గల సుందరి!

పెళ్లి పీటలెక్కనున్న సొట్టబుగ్గల సుందరి!

taapsee pannu to marry her

2024 ప్రారంభంలోనే పలువురు స్టార్‌ హీరోయిన్‌లు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలానే ఈ నెలల్లో హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకున్నారు. తన బాయ్‍ఫ్రెండ్, నటుడు జాకీ భగ్నానీని రకుల్ వివాహం చేసుకుంది. గోవాలో వీరి పెళ్లి ఫిబ్రవరి 21న జరిగింది. తాజాగా మరో స్టార్‌ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది. పదేళ్లుగా ప్రేమలో ఉన్న తన బాయ్‍ఫ్రెండ్, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోయ్‍ని తాప్సీ వివాహం చేసుకోనున్నారు.

ఈ క్రమంలోనే మార్చి నెలాఖరులో రాజస్థాన్‍లో ఉదయ్‍పూర్ వేదికగా వీరి వివాహం జరుగుతుందని అంటున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. బాలీవుడ్ సెలెబ్రిటీలను చాలా తక్కువ మందినే ఆహ్వానించాలని అనుకుంటున్నారు. సిఖ్, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరుగుతుందనే టాక్‌.

taapsee pannu 1

ఇటీవల తాప్సీ తమ ప్రేమ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలీవుడ్‍లో తన తొలి సినిమా ఛష్మీ బద్దూర్ (2013) షూటింగ్ సమయంలో మాథియస్‍ను తాను కలిశానని తాప్సీ చెప్పారు. అతడితో రిలేషన్‍లో తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపారు. ఇలా దశాబ్దం నుంచి తాప్సీ – మాథియస్ లవ్ స్టోరీ నడుస్తోంది అని వెల్లడించింది.

2010లో ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తాప్సీ. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ ఎదిగి పలు సినిమాలు చేసింది. తమిళం, మలయాళంలోనూ మూవీస్ చేశారు. ఇక్కడ ఛాన్స్‌లు తగ్గడంతో.. బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని పలు సినిమాలతో దూసుకుపోతుంది.

 

 

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!