HomeTelugu Trendingశభాష్‌ మిథూ : ట్రైలర్‌

శభాష్‌ మిథూ : ట్రైలర్‌

 

Shabaash mithu movie traile

బాలీవుడ్‌లో వరుసగా సినిమాలతో ఫుల్‌ జోష్‌లో ఉంది తాప్సీ పన్ను. ఇప్పటివరకు తప్పడ్‌, హసీనా దిల్‌రూబా, రష్మీ రాకెట్, లూప్‌ లపేటా చిత్రాలతో అలరించింది ఈ పంజాబీ భామ. తాజగా తాప్సీ నటించిన చిత్రం ‘శభాష్‌ మిథూ’. శ్రీజిత్‌ డైరెక్షన్‌ లో వస్తున్న ఈ సినిమా మాజీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌గా తెరకెక్కింది. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్‌లు, టీజర్‌కు మంచి సందన వచ్చింది. తాజాగా శభాష్ మిథూ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

రెండు నిమిషాల 44 సెకన్లపాటు సాగిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. మిథాలీ చిన్నతనంలో కన్న కలను చెబుతూ ప్రారంభమైన ట్రైలర్‌ ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది. తాప్సీ నటన అద్భుతంగా ఉంది. మన గుర్తింపును ఎవరూ మరిచిపోలేనంతలా ఆట ఆడి చూపిస్తా అని తాప్సీ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. వయకామ్‌ 18 స్టూడియోస్‌ నిర్మించిన ఈ చిత్రం జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu