HomeTelugu Trending'అర్జున్‌ రెడ్డి'ని దించేసిన బాలీవుడ్‌ 'కబీర్ సింగ్'

‘అర్జున్‌ రెడ్డి’ని దించేసిన బాలీవుడ్‌ ‘కబీర్ సింగ్’

4 7తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కబీర్‌ సింగ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. విజయ్‌ దేవరకొండ పాత్రలో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. టీజర్‌లో ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా మొత్తాన్ని ఉన్నది ఉన్నట్లు దించేశారు. ఒరిజినల్‌ సినిమాను తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగానే ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. కథలో ఎలాంటి మార్పూ చేయకుండా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. ఫైటింగ్‌ సన్నివేశాల్లోనూ ఎలాంటి మార్పూ లేదు. ఇందులో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జూన్‌ 21న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu