HomeTelugu Big Storiesషారుక్ ఖాన్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

షారుక్ ఖాన్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Shahrukh khan trolled visarసోషల్ మీడియాలో సెలబ్రిటీల హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక బాలీవుడ్ స్టార్స్‌ అయితే.. సోషల్ మీడియాలోనే ఎక్కువ గడిపేస్తుంటారు. హాట్ ఫొటోలను హీరోయిన్లు…వ్యక్తిగత విషయాలను హీరోలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఒకొక్కసారి సెలబ్రెటీలు తెలిసీతెలియక చేసే పనులతో నెటిజన్లు ట్రోల్స్‌కు గురి అవుతూ ఉంటారు. తాజాగా స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా ట్రోల్స్ బారిన పడ్డాడు. ‘ప్రార్థనలు, నిమజ్జనం పూర్తయ్యాయి. గణేశ మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు కురిపించాలి. సంతోషాన్నివ్వాలి. గణపతి బప్పా మోరియా’’ అంటూ బాలీవుడ్‌ బాద్‌ షా.. షారుక్‌‌ ఖాన్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు.

నుదుటిన కుంకుమ ధరించి ఉన్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను ఈ సందర్భంగా షేర్‌ చేశాడు. షారూఖ్ షేర్ చేసిన ఫోటో మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో ఉండి, నుదుటిన కుంకుమ కలర్‌లో కనిపిస్తుండే సరికి నెటిజన్లు షారుక్‌ ఖాన్‌పై ట్రోలింగ్స్‌ మొదలుపెట్టారు. కొందరు షారుక్ భక్తుడుగా బాగానే నటిస్తున్నాడు అని , మరికొందరు కుంకుమకు బదులు రంగు పూసుకున్నాడని, దేవుడి ముందు యాక్టింగ్ ఎందుకు ఆయనకు కోపం వస్తే శపిస్తాడు అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఇక షారుక్‌ ఫ్యాన్స్‌ మాత్రం.. ‘‘ప్రతీ ఏడాది వినాయక చవితిలాగే ఈసారి కూడా మమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేశావు. ఎంతైనా నీకెవరూ సాటి రారు. మనసున్న మంచి వ్యక్తివి నువ్వు’’అంటూ అభిమానం చాటుకుంటున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!