HomeTelugu Big Stories'ఏక్ మినీ కథ' ట్రైలర్‌

‘ఏక్ మినీ కథ’ ట్రైలర్‌

Ek Mini Katha Trailer
సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘ఏక్ మినీ కథ’. డైరెక్టర్‌ మేర్లపాక గాంధీ కథ అందించగా.. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించాడు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈనెల 27న ‘ఏక్ మినీ కథ’ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ఫన్నీ గా ఆసక్తికరంగా సాగింది. ఇందులో శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషిస్తుండగా.. బ్రహ్మాజీ, సుదర్శన్, పోసాని కృష్ణ మురళి, హర్షవర్ధన్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చురు. మే 27న రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu