బాహుబలి ఇన్సైడ్ రిపోర్ట్!

మొదటి పార్ట్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన ‘బాహుబలి’ చిత్రం ఇప్పుడు బాహుబలి2తో బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమైంది. రేపటి నుండి ప్రీమియర్ షోల హంగామా కూడా ఉంటుంది. మొదటి పార్ట్ 600 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం రెండో పార్ట్ తో వెయ్యి కోట్ల మార్క్ ను చేరుకోవాలనుకుంటుంది. అయితే వెయ్యి కోట్లు వసూళ్లు అనేది మామూలు విషయం కాదు. దానికి తగ్గ అధ్బుతాలు సినిమాలో ఉండాలి. అయితే అవి బాహుబలి2 లో పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.
సినిమా మొత్తానికి ఇంటర్వల్ బ్యాంగ్ హైలైట్ అని తెలుస్తోంది. సినిమా ఫస్ట్ పార్ట్ లో మిస్ అయిన ఎమోషన్స్, సెంటిమెంట్స్ సెకండ్ పార్ట్ లో క్యారీ చేసినట్లు తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో ఉండే ఎమోషనల్ డ్రామా బాగా పడిందని చెబుతున్నారు. ఇక విజువల్స్ పరంగా ఆడియన్స్ కు సినిమా కన్నుల పండువగా ఉంటుందని టాక్.