HomeTelugu Trendingశ్రీకారం ట్రైలర్‌ను రిలీజ్ చేసిన నితిన్, నాని, వరుణ్ తేజ్

శ్రీకారం ట్రైలర్‌ను రిలీజ్ చేసిన నితిన్, నాని, వరుణ్ తేజ్

Sreekaram Trailer

శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్నచిత్రం శ్రీకారం. ఇందులో శర్వానంద్ రైతు పాత్రను పోషిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ రొమాన్స్ చేయబోతుంది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను యువ హీరోలు నితిన్, నాని, వరుణ్‌ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. పట్టణంలో పెద్ద ఉద్యోగం చేసే యువకుడు అది వదిలేసి గ్రామంలో వ్యవసాయం చేయడానికి వెళ్తాడు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తాడు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో సాయికుమార్ కీలక పాత్రలో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu