HomeTelugu Trendingఆ విషయంలో శర్వానంద్‌ తగ్గడం లేదట!

ఆ విషయంలో శర్వానంద్‌ తగ్గడం లేదట!

3 10
యంగ్‌ హీరో శర్వానంద్ కెరియర్ ప్రారంభం నుండి నిదానంగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళుతుంటాడు. అలాగే షెడ్యూల్ .. షెడ్యూల్ కి కూడా గ్యాప్ తీసుకుంటూ తాపీగా షూటింగ్స్ పెట్టుకుంటూ ఈ హీరో. శర్వానంద్ ఎంచుకునే కథల కారణంగానే అటు యూత్ .. ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులలో ఆయన సినిమాల కు మంచి క్రేజ్‌ ఉంది.

ఈ కారణంగానే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తిని చూపుతుంటారు. పాపం ఇప్పుడు ఈ హీరోకి వరుసగా మూడు ఫ్లాపులు వచ్చాయి. అయినా ఆయన తన పారితోషికం విషయంలో తగ్గడం లేదట. సినిమాకి ఆయన 7 కోట్ల వరకూ తీసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. పారితోషికం విషయంలో తగ్గేది లేదని ఆయన చెబుతుండటంతో, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. శర్వా మాత్రం ‘శ్రీకారం’తో పాటు ప్రస్తుతం తన చేతిలో వున్న మూడు సినిమాలతో బీజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu