HomeTelugu Big StoriesRC16: స్క్రిప్ట్ విని ఆశ్చర్యపోయిన కన్నడ స్టార్ హీరో

RC16: స్క్రిప్ట్ విని ఆశ్చర్యపోయిన కన్నడ స్టార్ హీరో

Shivarajkumar about RC16 script

Shivarajkumar about RC16 script: మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరో బుచ్చిబాబు డైరెక్షణ్‌లో వస్తున్న చిత్రం RC16. స్పోర్ట్స్ డ్రామాగా పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఈ రోజు (మార్చి 20) ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి, ఏఆర్ రహమాన్, జాన్వీ కపూర్, స్టార్ డైరెక్టర్ సుకుమార్, శంకర్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

కాగా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‍కుమార్ ఓ కీలకమైన పాత్ర చేయనున్నారు. ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆర్సీ 16 కథను దర్శకుడు బుచ్చిబాబు సాన తనకు నరేట్ చేసినప్పుడు ఆశ్చర్యకలిగిందని శివ రాజ్‍కుమార్ చెప్పారు. ఈ మూవీ స్క్రిప్ట్ నెక్ట్స్ లెవెల్‍లో ఉందని తెలిపారు. ఈ క్యారెక్టర్‌ను బుచ్చిబాబు ఎలా క్రియేట్ చేసుకున్నారన్న విషయంలో తాను ఆశ్చర్యపోయానని శివ రాజ్‍కుమార్ అన్నారు.

బుచ్చిబాబు తనకు గంటన్నర పాటు ఈ మూవీ స్క్రిప్ట్ చెప్పారని శివ రాజ్‍కుమార్ వెల్లడించారు. రామ్‍చరణ్‍పై కూడా శివ రాజ్‍కుమార్ ప్రశంసలు కురిపించారు. రామ్‍చరణ్ మంచి వ్యక్తి అని, అద్భుతమైన నటుడు అని ఆయన అన్నారు. స్టోరీ చెప్పేందుకు వచ్చిన సమయంలో బుచ్చిబాబు తన వద్ద చేతులు కట్టుకొని నిలబడ్డారని, అయితే డైరెక్టర్ అలా చేయకూడదని తాను చెప్పానని ఆయన తెలిపారు.

రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ పొలిటికల్ యాక్షన్ తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే.. ఆర్సీ16 చిత్రీకరణ మొదలుకానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu