HomeTelugu Trendingకన్నడ హీరో 'ఘోస్ట్‌' ఫస్ట్‌లుక్‌

కన్నడ హీరో ‘ఘోస్ట్‌’ ఫస్ట్‌లుక్‌

Shivarajkumar ghost movie f
కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఘోస్ట్‌’. హైయెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘బీర్బల్‌’ ఫేమ్‌ శ్రీని డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత సందేశ్‌ నాగరాజ్‌ తన సందేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నేడు(జులై 12) శివరాజ్‌ కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ‘ఘోస్ట్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ రిలీజ్‌ చేశారు.

గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివరాజ్ కుమార్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. కేజీయఫ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు.ఆగస్ట్ చివరి వారంలో ‘ఘోస్ట్’ చిత్రీకరణ ప్రారంభం కానుందని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu