
SreeLeela Upcoming Movies:
టాలీవుడ్‌లో ఇటీవల వరుస సినిమాలతో ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీలకి ప్రస్తుతం ఊహించని షాకులు ఎదురవుతున్నాయి. ‘పెళ్లి సందD’, ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’ లాంటి హిట్స్‌తో టాప్ హీరోయిన్ రేసులోకి వచ్చిన శ్రీలీల తాజాగా మూడవ పెద్ద సినిమా నుంచీ తప్పుకున్నట్లు సమాచారం.
తాజాగా అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న పాలిటికల్ డ్రామా “లెనిన్” అనే చిత్రానికి శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఇప్పుడు తేదీల క్లాష్‌ను కారణంగా చూపిస్తూ ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనితో, భాగ్యశ్రీ బోర్స్ను కొత్త హీరోయిన్‌గా తీసుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఇది శ్రీలీలకు వరుసగా మూడవ సినిమా. ఇదివరకే నవీన్ పొలిశెట్టితో చేసిన ‘అనగనగా ఒక రాజు’ ప్రాజెక్ట్ నుంచి తప్పించుకోగా, నాగచైతన్య సినిమా నుంచి కూడా ఆమె ఔట్ అయ్యారు.
ఇక ఆమె కెరీర్‌ను గమనిస్తే, 2019లో ‘కిస్’ అనే సినిమాతో లీడ్ రోల్ ద్వారా తెరంగేట్రం చేసిన శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఆశికీ 3’, ‘మాస్ జాతర’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.
ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే తెలుగు పరిశ్రమలో శ్రీలీలకు టఫ్ టైమ్ నడుస్తోంది. కానీ బాలీవుడ్‌లో ఆమెకు లక్ మళ్లీ మారుతుందా? అనేది వేచి చూడాల్సిందే.













