HomeTelugu Trendingరష్మికపై మూవీ యూనిట్‌ ఆగ్రహం

రష్మికపై మూవీ యూనిట్‌ ఆగ్రహం

2 17
నటి రష్మిక మూవీ యూనిట్‌ అనుమతి లేకుండా సినిమా పేరును ప్రకటించడంతో సదరు యూనిట్‌ ఆమోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘గీత గోవిందం’ తెలుగు చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న రష్మిక. ఇటీవల ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో మరోసారి ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు కార్తికి జోడీగా ఓ చిత్రంలో నటిస్తోంది. విజయ్‌ సరసన కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మాణంలో ఇంకా పేరుపెట్టని ఓ చిత్రంలో నటిస్తోంది రష్మిక. భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నెపోలియన్‌, యోగిబాబు, సతీష్‌, మలయాళ నటుడు లాల్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను త్వరలోనే భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని అనుకుంది. అయితే ఉన్నట్టుండి నటి రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సుల్తాన్’ సినిమా చిత్రీకరణలో నాలుగోరోజు’ అంటూ ఓ ఫొటోను కూడా పోస్ట్‌ చేసింది. దీంతో చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి సస్పెన్స్‌ లేకుండా ఇలా చెప్పడంతో బృందం తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu