HomeTelugu Trendingబాలయ్యకు జోడిగా జెర్సీ భామ

బాలయ్యకు జోడిగా జెర్సీ భామ

5 24నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం .. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తరువాత బోయపాటితో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయడంలో బోయపాటి బిజీగా వున్నాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్‌లు అవసరం కాగా, ఒక హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ ను అనుకుంటున్నారట. ఇప్పటికే ‘జెర్సీ’.. ‘జోడీ’ సినిమాల ద్వారా శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu