పవన్ కల్యాణ్ అభిమానులకు పండగే


పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఏమీ లేకపోవడంతో అభిమానులు నిరాశగా ఉన్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా టీజ‌ర్ వ‌స్తుందని ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. జనవరి 14న సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఇప్పటివరకు లీక్ ఫొటోలతో సంబరపడ్డ పవన్ అభిమానులకు ఇది నిజంగా పండుగలాంటి వార్త. సంక్రాంతి రోజున వకీల్ సాబ్ టీజర్ చూసి పండుగ జరుపుకోబోతున్నారు. ఇందులో పవన్ సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. పవన్‌తో మూడోసారి జతకట్టనుంది. హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ రీమేక్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates