HomeTelugu Trendingవి.వి.వినాయక్‌ హీరోయిన్‌గా శ్రియ.!

వి.వి.వినాయక్‌ హీరోయిన్‌గా శ్రియ.!

12 15టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీనయ్య’. దిల్‌ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా విడుదలైన వినాయక్‌ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. అయితే ఈ సినిమా వినాయక్‌ సరసన ఎవరు కనిపించనున్నారనే విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ తరుణంలో ‘సీనయ్య’ సినిమాలో శ్రియ నటించనున్నారని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమాలో ఆమె వినాయక్‌ భార్యగా కనిపించనున్నారట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో వినాయక్ దర్శకత్వంలో విడుదలైన ‘ఠాగూర్‌’, ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రాల్లో శ్రియ హీరోయిన్‌గా నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu