HomeTelugu Trendingరాజశేఖర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిన శ్రియ

రాజశేఖర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిన శ్రియ

1 18
టాలీవుడ్‌ యంగ్రీ యంగ్‌ మెన్ రాజశేఖర్‌.. ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. కాగా తన తదుపరి చిత్రంలో శ్రియ హీరోయిన్‌గా నటించనుంది. కల్కి సినిమా తరువాత కాస్తంత గ్యాప్ తీసుకున్న ఈ హీరో.. ‘అహ నా పెళ్ళంట’, ‘పూలరంగడు’ సినిమాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం చౌదరికి తన తదుపరి సినిమాను అప్పగించారు. వాస్తవానికి ఓ కన్నడ రీమేక్ లో నటించాలని, దానికి ‘సత్య’, ‘బేతాళుడు’ సినిమాల దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తిని తీసుకోవాలని అనుకున్నారట. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కక పోవడంతో వీరభద్రం చౌదరికి లైన్ క్లియర్ అయింది.

దర్శకుడు ఈ సినిమాలో రాజశేఖర్ వయసుకు తగ్గ గ్లామర్ హీరోయిన్ కావాలని భావించడంతో శ్రియను ఎంపిక చేశారు. ఓ వైపు హుందాగా, మరోవైపు గ్లామర్‌ నూ ఒలికించే పాత్ర కాబట్టి శ్రియ, న్యాయం చేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా సిగ్నల్‌ ఇచ్చేసిందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu