నెపోటిజం పై శృతి హాసన్ కామెంట్స్

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్ నెపోటిజంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఇప్పటికే పలువురు ఆరోపిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య తర్వాతే నెపోటిజం మళ్లీ తెరపైకి వచ్చింది. బాలీవుడ్‌ కొంత మంది చేతుల్లోనే నడుస్తోందని కంగనా‌, వివేక్‌ ఒబెరాయ్‌ వంటి వారు సైతం వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కమల్ హాసన్ కూతురు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా నెపోటిజంపై కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో అంతగా మెప్పించలేకపోయినా సౌత్‌లో మాత్రం స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా తల్లిదండ్రుల కారణంగానే నేను సులభంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టగలిగాను. నేను దానిని ఖండించలేను. అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక మాత్రం నాజర్నీ సాఫీగా సాగలేదు. అది అందరికీ తెలిసిందే. ఎన్నో ఓటములను చవిచూశాను. ఎంతో కాలం కష్టపడితేనే నాకు విజయం వచ్చింది. వారసత్వం వల్ల ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం సులభమే కానీ నిలదొక్కుకోవడం మాత్రం చాలా కష్టమని నాకు అర్థమైంది అంటోంది శృతిహాసన్.

CLICK HERE!! For the aha Latest Updates