బాలయ్య న్యూ పోస్టర్ .. ఫ్యాన్స్‌ పండుగే

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘105’ వ చిత్రంకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ కొత్తలుక్‌లో కనిపిస్తున్నారు. గెటప్ కొత్తగా ఉన్నా.. లోపల మాస్ మాత్రం అలాగే ఉంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ పోస్టర్ ను తీర్చిదిద్దారు. బాలయ్య ముఖానికి పసుపు కుంకుమ వంటివి పులుముకొని చేత్తో కత్తిపట్టుకొని ఉన్న ఫోటో అది. ఫోటో కొత్తగా ఉన్నా బాలయ్యలోని మాస్ ను ఫోటో ఎలివేట్ చేస్తున్నది. బాలయ్య ఫ్యాన్స్ కు ఈ ఫోటో ఖచ్చితంగా నచ్చుతుంది.