HomeTelugu Newsభారత్‌లో దాడులకు కుట్ర.. కశ్మీర్‌లో హైఅలర్ట్‌

భారత్‌లో దాడులకు కుట్ర.. కశ్మీర్‌లో హైఅలర్ట్‌

2 25జమ్ము-కశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. పఠాన్‌కోట్‌తో సహా నాలుగు వైమానిక స్థావరాలపై ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది. 8 నుంచి 10 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారని.. వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి సిద్ధమవుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో శ్రీనగర్, అవంతిపురా, జమ్ము, పఠాన్‌కోట్, హిందోవ్ స్థావరాల్లో భద్రతను మరింత పెంచారు. ఉన్నతాధికారులు 24 గంటల పర్యవేక్షణలో ఉండాలని కేంద్రం నుంచి ఆదేశాలిచ్చింది.

ఆర్టికల్ 370 రద్దు, జమ్ము-కశ్మీర్ రాష్ట్ర విభజనతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారీ దాడికి ప్లాన్ చేసినట్లు నిఘావర్గాలు సైన్యాన్ని అలర్ట్ చేశాయి. సెప్టెంబర్ 25 నుంచి 30 మధ్యలో దాడులు జరగొచ్చని హెచ్చరించాయి. అంతేగాక 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జరిగిన దాడిని గుర్తు చేస్తూ.. అంతకంటే పెద్దస్థాయిలో దాడులకు సిద్ధమవుతున్నారని అప్రమత్తం చేశాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu