HomeTelugu Big Storiesఅఫీషియల్‌: ప్రభాస్‌ 'సలార్‌'లో శృతిహాసన్‌

అఫీషియల్‌: ప్రభాస్‌ ‘సలార్‌’లో శృతిహాసన్‌

Shruti Hassan in Prabhas Sయంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో “సలార్”‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌తో జోడీ కట్టే అవకాశం దక్కించుకుంది శృతిహాసన్‌. కాగా ఇప్పటి వరకు ఈ వార్తలపై సైలైంట్‌గా ఉన్న మూవీయూనిట్‌ నేడు శృతి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఇక ఈ వారంలోనే సలార్‌ షూటింగ్‌ షురూ కానుంది.

ఇప్పటికే సింగరేణి బొగ్గు గనిలో ఫైటింగ్‌ సీన్‌ కోసం సెట్‌ సిద్ధం చేస్తున్నారు. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు భువన్‌గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. శృతి హాసన్‌ తాజాగా నటించిన ‘క్రాక్’‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో అందరి దృష్టి శృతి మీద పడింది. అలా ఆమెకు పాన్‌ ఇండియా మూవీ ‘సలార్’లో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu