HomeTelugu Trendingమణిరత్నం డైరెక్షన్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సిద్‌ శ్రీరామ్‌!

మణిరత్నం డైరెక్షన్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సిద్‌ శ్రీరామ్‌!

sid sriram
సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినసరం లేదు. యూత్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన కడలి సినిమాతో సిద్‌ శ్రీరామ్‌ వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా మారనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడంతో హీరోగా చేయడానికి సిద్‌ శ్రీరామ్‌ కూడా అంగీకరించినట్లు కోలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu