HomeTelugu Trendingకమల్‌తో బొమ్మరిల్లు హీరో..!

కమల్‌తో బొమ్మరిల్లు హీరో..!

6 172పాయింట్ 0 మూవీ తరువాత శంకర్.. కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. మొదట ఈ సినిమాలో కీలకమైన రోల్ కోసం శింబును తీసుకున్నారు. ఏమైందో ఏమో తెలియదుగాని, శింబును పక్కన పెట్టి ఆ ప్లేస్ శంకర్ శిష్యుడు సిద్దార్ధ్ ను తీసుకున్నారు.

తెలుగులో బాయ్స్ సినిమాతో పరిచయం అయిన సిద్దార్ధ ఆ తరువాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ఆ తరువాత క్రమంగా హిట్స్ శాతం తగ్గిపోవడంతో ఈ యువ హీరో.. సినిమాలు తగ్గిపోయాయి. కెరీర్ ముగిసిపోతుంది అనుకుంటున్న సమయంలో శంకర్ నుంచి పిలుపు వచ్చింది. సిద్దార్ద్ ఈ సినిమాలో కీలకమైన రోల్ ప్లే చేస్తున్నాడట. మరి ఈ సినిమాతోనైనా సిద్దార్ధ కెరీర్ తిరిగి గాడిలో పడాలి అని కోరుకుదాం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu