శిల్పా చక్రపాణిరెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో ఆయన పరిస్థితేంటి ?

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే..  శిల్పా చక్రపాణిరెడ్డి. ప్రస్తుతం ప్రజల్లో శిల్పా చక్రపాణిరెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. శిల్పా చక్రపాణిరెడ్డి అలియాస్ సింగారెడ్డి గారి చక్రపాణిరెడ్డి ఉమ్మడి కడప జిల్లా పెద్ద ముడియం మండలం కొండ సుంకేసుల గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చక్రపాణి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. చక్రపాణి రాజకీయాల్లోకి రాకముందు కుటుంబ వ్యాపారాల్లో ఉండేవారు. చక్రపాణి కుటుంబ నేపథ్యంలోకి వెళ్తే.. సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి మాజీ మంత్రి, సోదరుడి కుమారుడు ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి.
చక్రపాణి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టి సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి రాజకీయ ఎదుగుదలలో కీలకమైన పాత్ర పోషించారు. 2011లో వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీ పార్టీలో చేరి జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర లో భాగంగా కర్నూల్ జిల్లాలో కీలకంగా వ్యవహరించారు. అయితే రాష్ట్ర విభిజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి తో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తరుపున 2014 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశైలం నుండి పోటీ చేసి ఓటమి చవిచూసినా అనంతరం జరిగిన కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీ నుండి తమ రాజకీయ ప్రత్యర్థులైన భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత పార్టీలో తమ కుటుంబానికి ప్రాధాన్యం తగ్గుతున్న దశలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సోదరుడితో పాటు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
2018 లో జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి గెలుపు కోసం పనిచేసినా ఓటమి తప్పలేదు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశైలం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఇంతకీ, రాజకీయ నాయకుడిగా శిల్పా చక్రపాణిరెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో శిల్పా చక్రపాణిరెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ శిల్పా చక్రపాణిరెడ్డికి ఉందా ?, చూద్దాం రండి.
శిల్పా చక్రపాణిరెడ్డి కుటుంబం ఈరోజు రాజకీయాల్లో ఒక ప్రముఖ కుటుంబంగా గుర్తింపు సాధించడంలో చక్రపాణి రెడ్డి పాత్ర కీలకం. శిల్పా సహాకర్ సంస్థ ఏర్పాటుతో పాటు ఆ సంస్థ కార్యకలాపాల్లో చక్రపాణి రెడ్డి ఇప్పటికి క్రియాశీలకంగా ఉంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అయితే, శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత  ఆయన చుట్టూ పలు వివాదాలు చుట్టుముట్టాయి. ప్రజల్లో శిల్పా చక్రపాణిరెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం కూడా ఏమీ బాగాలేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో తన వారసుడిని శ్రీశైలం నుండి పోటీచేయించేందుకు ఇప్పటికే శిల్పా చక్రపాణిరెడ్డి అన్ని విధాలుగా ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ, ఈ సారి శిల్పా చక్రపాణిరెడ్డి కొడుకు కూడా గెలవడం కష్టమే.
CLICK HERE!! For the aha Latest Updates