శింబు బిగ్ బాస్ బ్యూటీ లిప్‌లాక్‌.. వీడియో వైరల్‌


తొమ్మిదేళ్ల క్రితం తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన నటి ఓవియా. అప్పట్లో అందాలు ఆరబోసినా పెద్దగా గుర్తింపు రాలేదు. వరసపెట్టి సినిమా అవకాశాలు వచ్చినా పెద్దగా క్రేజ్ లేదు. అయితే రెండేళ్ల క్రితం ఓవియా జాతకం మారిపోయింది. తమిళ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్న ఈమె ఎక్కడలేని క్రేజ్ సంపాదించేసింది. ఇక అప్పటి నుంచి తమిళనాట ఈ హాట్ బ్యూటీ హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ఓవియా నటించిన తాజా మూవీ ’90ml’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లు బోల్డ్ కంటెంట్‌తో నిండిపోవడంతో సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది. దీనికి తోడు ఈ సినిమాకి శింబు (ఎస్టీఆర్) సంగీతం అందించడం, అతిథిపాత్ర పోషించడంతో అంచనాలు ఏర్పడ్డాయి. శింబు అభిమానులు సైతం థియేటర్లకు క్యూ కట్టారు.

అయితే సినిమాలో శింబు ఎంట్రీ, క్లైమాక్స్ సీన్ చూసి ప్రేక్షకులు షాక్ తిన్నారు. క్లైమాక్స్‌లో వచ్చే పబ్ సీన్‌లో కనిపించిన శింబు.. ఓవియాతో ఘాటుగా ఒక లిప్ లాక్ లాగాడు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శింబు అభిమానులు కానీ, ఓవియా ఫ్యాన్స్ కానీ అస్సలు ఊహించని ఈ సన్నివేశం చూసి అంతా షాకయ్యారట. సినిమా మొత్తం ఎలా ఉన్నా క్లైమాక్స్ సీన్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్లలో ఈలలు కేకలు. దానికి కారణం ఈ లిప్ లాక్.

ఈ చిత్రానికి అనిత ఉదీప్ దర్శకత్వం వహించారు. ఐదుగురు అమ్మాయిల వ్యక్తిగత జీవితాల చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. అమ్మాయిల కథ కాబట్టి బోల్డ్ కంటెంట్‌ను బాగానే గుప్పించారు. అయితే బోల్డ్ కంటెంట్ మరీ అతి అయిపోయిందని విమర్శలు వస్తున్నాయి. సినిమా కూడా అంతంత మాత్రంగానే ఉందట. శింబు అందించిన సంగీతం అద్భుతంగా ఉందని అంటున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత మళ్లీ లిప్‌ లాక్‌తో శింబు హాట్ టాపిక్‌గా మారారు.

CLICK HERE!! For the aha Latest Updates