HomeTelugu TrendingBB3లో సీనియర్‌ హీరోయిన్

BB3లో సీనియర్‌ హీరోయిన్

Simran in BB3
నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ‘బిబి3’ వర్కింగ్ టైటిల్ తో సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అలాగే హీరోయిన్ గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఒక పాత్రకు సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో వీరి కాంబినేషన్ లో నరసింహ నాయుడు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సిమ్రాన్ పాత్ర చాలా కీలకం అని తెలుస్తుంది. ఇక బోయపాటి గతంలో బాలయ్య తో కలిసి తీసిన మొదటి సినిమా ‘సింహ’ పెద్ద హిట్ అందుకుంది. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సింహను మించి విజయం అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వస్తోన్న ఈ మూడో సినిమా లెజెండ్ ను మించిన హిట్ అవ్వాలనీ బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నవీన్ చంద్ర ఎమ్మెల్యేగా నటించనున్నాడు అని ప్రచారం జరుగుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu