తల్లి కాబోతున్న సింగర్ గీతామాధురి.. సైలెంట్‌గా సీమంతం

టాలీవుడ్‌ సింగర్ గీతామాధురి.. మాస్ పాట‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజ‌న్ 2లో పాల్గొని ఫైన‌లిస్ట్‌గా కూడా నిలిచింది ఈ భామ. పాట‌ల‌తోనే కాకుండా అందంతో కూడా ఆక‌ట్టుకుంటుంది గీతామాధురి. ఇప్ప‌టికే వంద‌ల పాట‌లు పాడిన ఈమె కొన్ని రోజులుగా పాట‌ల‌కు దూరంగా ఉంది. దానికి కార‌ణం ఆమె గ‌ర్భిణి కావ‌డ‌మే.

ఫిబ్ర‌వ‌రి 9, 2014న త‌ను ప్రేమించిన నందును పెళ్లి చేసుకుంది ఈమె. ఈయ‌న కూడా న‌టుడిగా ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు స్టేజ్ షోలు, రియాలిటీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు ఇంట్లోనే ఉంది. ఇక త్వ‌ర‌లోనే తల్లి కాబోతుంది. ఈ మ‌ధ్యే సంద‌డి లేకుండా శ్రీ‌మంతం ఫంక్ష‌న్ కూడా చేసారు. దీనికి ఇండస్ట్రీ ప్రముఖులు కూడా కొందరు హాజరయ్యారు.

మీడియాకు స‌మాచారం లేక‌పోయినా కూడా దీనికి ఇండ‌స్ట్రీ నుంచి కొంద‌రు ప్ర‌ముఖుల‌తో పాటు తోటి గాయ‌నీ గాయ‌కులు ఈ వేడుక‌కు వెళ్లారు. అలా కొన్ని ఫోటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ వేడుక‌కు గీతామాధురికి అత్యంత స‌న్నిహితులైన‌ యాంకర్ శ్యామల, సింగర్స్ పరిణిక, అంజనా సౌమ్య, మాళవికలతో పాటు మ‌రికొంద‌రు ప్ర‌ముఖులు హాజరైనట్టు తెలుస్తుంది.