HomeTelugu News'సింగం3' మోషన్ పోస్టర్!

‘సింగం3’ మోషన్ పోస్టర్!

తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ను సంపాందించుకున్న అగ్ర కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సింగం3’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. శుక్రవారం చిత్ర మోషన్ పోస్టర్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా.. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ”సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందిన సింగం, సింగం-2 చిత్రాలు చక్కటి విజయాల్ని సాధించాయి. వాటికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రమిది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. తెలుగు ప్రేక్షకుల్ని అలరించే అన్ని అంశాలున్న చిత్రమిది.మోషన్ పోస్టర్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. నవంబర్ 7న చిత్ర టీజర్‌ను,అదే నెలాఖరున చిత్ర గీతాల్ని విడుదల చేస్తాం. డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!